TE/Prabhupada 1078 - మనస్సు ,బుద్ధిని రెండింటిని నిమగ్నం చేస్తూ ఇరవై నాలుగు గంటలు భగవంతుని తలుచుకోవాలి: Difference between revisions
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
(No difference)
|
Latest revision as of 23:38, 1 October 2020
660219-20 - Lecture BG Introduction - New York
మనస్సు మరియు బుద్ధిని రెండింటిని నిమగ్నం చేస్తూ యిరువది నాలుగు గంటలు భగవంతుని తలుచుకొనుట భగవంతుని ప్రతి బలమైన ప్రేమ పూర్వక ప్రేరణ కలిగియున్నపుడు, అప్పుడు మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా అదే సమయము నందు దానితో పాటుగా భగవంతుని తలుచుకొనుట సాధ్యమగును. కావున ఆ రకమైనటువంటి భావన పెంపొందించుకోవలెను. ఏ విధముగా అర్జునుడు ఎల్లప్పుడు భగవంతుని తలుచుకొనుచుండెను. ఆయన 24 గం..లలో క్షణ కాలం కూడా కృష్ణుని మరువకుండెను. కృష్ణుని యొక్క శాశ్వత సహచరుడు అదే సమయంలో ఒక యోధుడు కూడా. కృష్ణ భగవానుడు అర్జునుని యుద్ధము చేయవద్దని ప్రోత్సహించలేదు, అడవికి వెళ్ళు, హిమాలయాలకి వెళ్లి ద్యానించుకో. యోగ విధానాన్ని అర్జునునికి ప్రతిపాదించినపుడు అర్జునుడు నిరాకరించెను. ఈ విధానము నాకు సాధ్యము కాదు అనెను. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా అని భగవంతుడు పలికెను ( BG 6.47) మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః కావున ఎవరయితే ఎల్లప్పుడు భగవంతుని స్మరించు కొనుచుందురో అతడు సర్వోత్తమ యోగి. అతడు పరమోత్కృష్టమైన జ్ఞాని అదే సమయమునందు గొప్ప భక్తుడు కూడా తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ ( BG 8.7) అని భగవంతుడు ఉపదేశించెను. క్షత్రియునిగా నీ యొక్క యుద్ధము చేయుట అను వ్యాపకమును విడువరాదు నీవు యుద్ధము చేయవలసినదే. కావున అదే సమయమునందు నీవు నన్ను చింతించుట అభ్యసించినచో అపుడు అది సాధ్యమగును. అంతకాలే చ మామేవ స్మరణ ( BG 8.5) అపుడు మరణ సమయమునందు కూడా నన్ను గూర్చి చింతించుట సాధ్యమగును. మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైష్యస్య అసంశయమ్ అందులో ఎటువంటి సందేహము లేదని మరల ఆయన చెప్పెను. ఎవరైనా సంపూర్ణముగా భగవంతుని సేవలో శరణాగతులైనట్లయితే భగవంతుని యొక్క దివ్యమయిన ప్రేమ పూర్వక సేవయందు, మయ్యార్పితమనోబుద్ధిర్ ( BG 8.7) ఎందుచేతననగా వాస్తవముగా మనము మన శరీరముతో పని చెయ్యము మన మనస్సు మరియు బుద్ధితో పని చేసెదము. అదే విధముగా మన యొక్క బుద్ధి, మనస్సు ఎల్లప్పుడు భగవంతుని చింతనలో నియుక్తమయినపుడు సహజముగానే మన ఇంద్రియములు కూడా భగవంతుని సేవలో నియుక్తమగును. అదే భగవద్గీత యొక్క గుహ్యతమ విషయము ఎటుల భగవంతుని యందు నిమగ్నము కావలెను అను కళను మనము నేర్వవలెను, మనస్సు మరియు బుద్ధి, ఈ రెండింటి ద్వార 24 గం భగవంతుని చింతించుట. అది మనలను భగవద్ధామమునకు చేర్చుటకు సహాయపడును. లేక ఈ భౌతిక దేహాన్ని త్యజించిన పిమ్మట ఆధ్యాత్మిక లోకమునకు తీసుకెళ్లును. (వాతావరణమునకు నెలకొల్పును.) ఆధునిక శాస్త్రవేత్తలందరూ కలసి సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తున్నారు. చంద్రలోకము చేరుకొనుటకు, కానీ యింతవరకు వారు సమీపించలేదు కానీ భగవద్గీత యందు ఒక సూచన కలదు. ఒక వేళ వ్యక్తి ఇంకొక 50 సం..లు జీవించినచో మరియు అతను...... కానీ ఎవరూ కూడా తనను తాను ఉద్దరించుకోనుటకు ఆధ్యాత్మిక ఆలోచనతో 50 సం.. రాల పాటు ప్రయత్నించరు అది చాలా గొప్ప ఆలోచన. కానీ కనీసం 10 లేక 5 సం..ల పాటు తీవ్రతతో ఈ ఆచరణ కొరకు ప్రయత్నిచినచో మయ్యార్పితమనోబుద్ధి ( BG 8.7) ఇది కేవలము అభ్యాసముతో ముడిపడిన విషయము మరియు భక్తియుత సేవ విధానము ద్వార ఆ అభ్యాసము సుసాధ్యమగును, శ్రవణం శ్రవణం. శ్రవణము చేయుట అతి సులువైన విధానము
- శ్రవణం కీర్తనం విష్ణో
- స్మరణం పాద సేవనం
- అర్చనం వందనం దాస్యం
- సఖ్యం ఆత్మనివేదనం
- ( SB 7.5.23)
ఇవి తొమ్మిది పద్దతులు. కావున సులభమైన పద్ధతి ఏమిటంటే సరళముగా శ్రవణము చేయడము.